ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన

By

Published : Sep 28, 2020, 4:42 PM IST

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎస్​ఎఫ్​ఐ) విశాఖలో ఆందోళన చేపట్టింది. అక్టోబర్ 3 న జరిగే డిప్లొమా పరీక్షలు రద్దు చేసి.. విద్యార్థులను పై తరగుతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.

విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన
విశాఖలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన

విశాఖలో భారతీయ విద్యార్థి సమాఖ్య ఆందోళన చేపట్టింది. అక్టోబర్ 3 నుంచి జరిగే డిప్లొమా పరీక్షలను రద్దు చేసి... విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డిప్లొమా విద్యార్థులు జీవీఎంసీ గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details