ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

By

Published : Nov 1, 2020, 11:39 AM IST

సర్ధార్ వల్లభాయ్ 145 వ జయంతి వేడుకలు విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఏబీవీపీ నేతలు కొనియాడారు.

sardar-vallabhbhai-patel-jayanthi
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం


పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్ధార్ వల్లభాయ్ 145 వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. డిగ్రీ కళాశాల అధ్యక్షుడు తమన్ ఆధ్వర్యంలో 'జాతీయ ఐక్యతా దినోత్సవం' నిర్వహించారు. తన కృషితో, రాజనీతితో 550 రాజ్య సంస్థానాలను స్వతంత్ర భారతంలో విలీనం చేసి దేశాన్ని సమైక్యంగా నిలబెట్టిన మహనీయులు వల్లభాయ్ పటేల్ అని ఏబీవీపీ వనవాసి కృష్ణ కొనియాడారు.

భారత రాజ్యాంగాన్ని పటిష్ట పరచడంలో ఆయన పాత్ర అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ ఎంఎంఎల్​ పాత్రుడు, రాష్ట్ర వనవాసి విద్యార్థుల కన్వీనర్ కొండబాబు, రాష్ట్ర కార్యసమితి సభ్యులు ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లంగి శ్రీను, జిల్లా సంఘటనా కార్యదర్శి అశోక్ కుమార్​, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

బొర్రా గుహల వద్ద పర్యటకుల సందడి

ABOUT THE AUTHOR

...view details