ఆంధ్రప్రదేశ్

andhra pradesh

300 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఐదుగురి అరెస్టు

By

Published : Jun 15, 2020, 5:52 PM IST

అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నర్సీపట్నం గ్రామీణ పోలీసులు మాటువేశారు. ఆటోలో తరలిస్తున్న 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

raw liquor seized by narsipatnam police in visakhapatnam district
నాటుసారాని స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు

విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు మాసంపల్లిలో.... ఆటోలో తరలిస్తున్న 300 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో మాటువేసిన పోలీసులు... చాకచక్యంగా పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసి... ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details