ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిర్విరామంగా కొనసాగుతున్న అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి నిరసనలు

By

Published : Jun 18, 2021, 7:38 AM IST

విశాఖ జీవీఎంసీ వద్ద అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి చేపట్టిన నిరసన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

All-party labor and peasant group protests
అఖిల పక్ష కార్మిక, కర్షక సమితి నిరసనలు

విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద అఖిలపక్ష కార్మిక, కర్షక సమితి చేపట్టిన నిరసన దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసన చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భాజపా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు.

సీఐటియూ నాయకులు కుమార్, ఐకాస ఛైర్శన్​ జగ్గునాయుడు నేతృత్వంలో కార్మికులు నిరసన దీక్షలు సాగిస్తున్నారు. కేంద్ర నిర్ణయం ఉపసంహరించే వరకు ఉద్యమం ఆగదని నేతలు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ..Cji NV Ramana: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details