ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బీచ్​ రోడ్డులో బైక్ రేసింగ్.. 15 మంది అరెస్ట్

By

Published : Nov 23, 2020, 11:13 AM IST

విశాఖ బీచ్ ‌రోడ్డులో శని, ఆదివారం అర్ధరాత్రి అతివేగంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 15 మంది యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

బీచ్​ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు అరెస్టు
బీచ్​ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తున్న యువకులు అరెస్టు

ద్విచక్ర వాహనాలతో రేస్‌ డ్రైవింగ్‌ చేస్తున్న యువకులను సీఐ కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్సై ధర్మేందర్‌, సిబ్బంది పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి విడిచిపెట్టారు. 15 వాహనాలు సీజ్‌ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. డీసీపీ ఐశ్వర్య రస్తోగి స్వయంగా బీచ్‌రోడ్‌ను పరిశీలించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details