ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Simhachalam : సింహగిరిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

By

Published : Sep 17, 2021, 1:53 PM IST

విశాఖ జిల్లా సింహాచలం గిరి పై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభయ్యాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలలో నేడు అంకురార్పణ పూజలు ఘనంగా నిర్వహించారు.

Simhachalam
సింహగిరిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

సింహగిరిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

విశాఖ జిల్లా సింహాచలం గిరి పై వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ వేడుకలు అప్పన్నకు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి గంగధార వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టమన్ను తీసి ఘనంగా అంకురార్పణ పూజలు నిర్వహించారు. రేపటి నుంచి హోమాలు, వేద పారాయణ నిర్వహించనున్నారు. మూడో రోజు స్వామికి పవిత్ర సమర్పణ చేయనున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఉత్సవాలు నిర్వహించే ఈ ఐదు రోజుల పాటు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

అంకురార్పణ పూజల్లో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈనెల 16 నుంచి శ్రీస్వామివారి తిరు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 20న ఏకాంత స్నపనంతో పవిత్ర ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఇది పూర్తిగా వైదిక కార్యక్రమమని ఈ కాలంలో ఉదయం ఆరాధన తర్వాత.. విశేష హోమాలు,పూర్ణాహుతి జరుగుతాయని అర్చకులు వివరించారు. పవిత్ర అలంకృతుడైన స్వామిని సేవించిన భక్తులు స్వామి అనుగ్రహం తప్పక పొందుతారని తెలిపారు.

ఇదీ చదవండి : 'కళ్యాణ మండపాన్ని ఇంత సుందరంగా ఎన్నడూ చూడలేదు'

ABOUT THE AUTHOR

...view details