ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మారిన రైళ్ల వేళలు.. దేశవ్యాప్తంగా రేపటినుంచి అమల్లోకి

By

Published : Nov 30, 2020, 7:09 PM IST

దేశవ్యాప్తంగా రేపటినుంచి మారిన రైళ్ల వేళలు అమల్లోకి రానున్నాయి. రైల్వే శాఖ అధికారిక వెబ్​సైట్​లో మారిన వేళలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రతి స్టేషన్​లోనూ సమయాలను ప్రదర్శించనున్నారు.

train timings
మారిన రైళ్ల వేళలు.. దేశవ్యాప్తంగా రేపటినుంచి అమల్లోకి

మారిన రైలు వేళలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ప్రతి రైల్వే డివిజన్​లోనూ ఒకటి రెండు రైళ్లు తప్ప మిగిలిన అన్ని రైళ్ల సమయాల్లో 10 నుంచి అరగంట వరకు మార్పు వచ్చింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త వేళలు అమలవుతాయి.

రైల్వే అధికారిక వెబ్ సైట్​లో మారిన రైళ్ల సమయాలు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్లలోనూ కొత్త సమయాలను రైల్వే శాఖ ప్రదర్శిస్తోంది. తూర్పు కోస్తా రైల్వేలో డివిజన్ల వారీగా కొత్త సమయాలను అధికారులు విడుదల చేశారు. కొవిడ్ కారణంగా నడుపుతున్న ప్రయాణికుల రైళ్లన్నంటిని ప్రత్యేక రైళ్లగానే పరిగణిస్తున్నారు. విశాఖ జిల్లా వాల్తేర్ డివిజన్​లో 2, 3 రైళ్లు మాత్రమే సమయాలు మారకుండా ఉన్నాయి. మిగిలినవన్నీ కొత్త సమయం ప్రకారమే నడుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details