కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. లాక్డౌన్ ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ గొడుగు సిద్ధాంతాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. గొడుగులు వాడటం ద్వారా మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం ఏర్పడుతుందని తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలోని రెడ్జోన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు గొడుగులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు. ఇదే సిద్ధాంతంతో..ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని కమిషనర్ పిలుపునిచ్చారు.
కరోనా నియంత్రణకు సరికొత్త ఆలోచన !
కరోనా కట్టడికి విశాఖకు చెందిన వైద్యుడు కూటికుప్పల సూర్యారావు సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాందించారు. ప్రతి ఒక్కరూ గొడుగులు వాడటం ద్వారా మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం ఏర్పడి వైరస్ వ్యాప్తి ఆగిపోతుందన్నారు.
కరోనా నియంత్రణకు సరికొత్త ఆలోచన