ETV Bharat / bharat

కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

author img

By

Published : Apr 24, 2020, 9:29 AM IST

కొద్దిరోజులుగా కంటిపై కునుకులేకుండా చేస్తోన్న కరోనాపై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తోన్న వేళ.. నేను సైతం అంటూ ఓ ఆరునెలల చిన్నారి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. వైరస్​ను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ.. ఔరా అనిపిస్తోంది. అదేంటి ఏడాది కూడా నిండని ఆ అమ్మాయికి ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథ చదివేయండి.

Six-month girl gave message on coronavirus to people through a photograph
కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

ప్రపంచ దేశాలపై కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ఓ 6 నెలల చిన్నారి.. ఫొటోల ద్వారా అద్భుత సందేశాన్నిస్తోంది. గుజరాత్​లోని వల్సాద్​ ప్రాంతానికి చెందిన ఈ పాపాయి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని తన చిత్రాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు శానిటైజర్​తో చేతులను శుభ్రపరచుకోవాలని కూడా అవగాహన కల్పిస్తోంది.

కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!

కొవిడ్​ రక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య శాఖ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగానే ధరంపుర్​ వాసి కునాల్​ భాయ్​ పాండ్య.. ఇలా తన కూతురు హెట్వి ద్వారా ప్రజలను ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ విజ్ఞప్తి చేశారు.

గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తోన్న పాండ్య.. వైరస్​కు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఇలా తన కూతురు ద్వారా అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి: మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.