ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెదిరింపు ధోరణి - సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం: నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 9:42 PM IST

Updated : Dec 17, 2023, 6:14 AM IST

Nara Lokesh Yuvagalam Padayatra In Vizag: తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్ వివిధ వార్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 3 నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.

Nara Lokesh Yuvagalam Padayatra
Nara Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra In Vizag:తెలుగుదేశం జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో కోలహలంగా సాగుతోంది. 224వ రోజు ప్రారంభమైన పాదయాత్రలో, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో లోకేశ్ భేటీ అయ్యారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్‌ గాలికొదిలేశారని, నారా లోకేశ్ మండిపడ్డారు. బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల వారు, యువనేతను కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు.3నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ వారికి హామీ ఇచ్చారు.

చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం: బీసీలపై జగన్‌ ప్రభుత్వం 26 వేల అక్రమ కేసులు పెట్టిందని లోకేశ్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో గంజాయి సాగు జోరుగా సాగుతోందని లోకేశ్ తెలిపారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్ల బెల్లంపై ఆంక్షలు తెనున్నట్లు లోకేశ్ ప్రకటించారు. చెరకు రైతులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్‌ కాల్వల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని లోకేశ్ ఆరోపించారు. గంగాదేవిపేట రైతులు లోకేశ్​ను కలిసి శారద కాల్వ పూడికపై వినతిపత్రం ఇచ్చారు. అధికారంలోకి రాగానే శారద కాల్వ పూడిక తీయిస్తామని, కాల్వలో నీరు కలుషితం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు లోకేశ్ తెలిపారు.

లోటు బడ్జెట్​లోనూ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం - బీసీ ఉపకులాల అభ్యున్నతికి చర్యలు : లోకేశ్

అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుంది: మునగపాకలో అంగన్వాడీల శిబిరాన్ని సందర్శించిన లోకేశ్ అధికారంలోకి వచ్చాక డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. వాలంటీర్లతో అంగన్వాడీలు నడిపించుకుంటామని మంత్రులు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.

యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ - ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ

టీడీపీతోనే యాదవులకు రాజకీయ అవకాశాలు: జీవీఎమ్​సీ 82వ వార్డులో యాదవులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. యాదవులకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది, తెలుగుదేశం పార్టీనేనని లోకేశ్ గుర్తు చేశారు. దామాషా ప్రకారం యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని లోకేష్‌ భరోసా ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో యాదవులకు 90 శాతం రాయితీతో పరికరాలు అందించినట్లు లోకేశ్ తెలిపారు. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించామని లోకేశ్ పేర్కొన్నారు. యాదవులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌, విదేశీ విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం వచ్చాక గొర్రెలు చనిపోతే బీమా సొమ్ము అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేయనున్నట్లు లోకేశ్ తెలిపారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక యాదవులకు రాజకీయ అవకాశాలు, కమ్యూనిటీ భవనాలు : లోకేశ్

బెదిరింపు ధోరణి - సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిదర్శనం: నారా లోకేశ్
Last Updated : Dec 17, 2023, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details