ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mudapaka Land Case: ముదపాక జగనన్న కాలనీలో అధికారుల అత్యుత్సాహం.. కోర్టులో ఉన్న స్థలంలో పనులపై బాధితుల ఆందోళన

By

Published : Jun 2, 2023, 9:44 AM IST

Updated : Jun 3, 2023, 11:51 AM IST

Mudapaka Land Case: విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం సమీకరించిన భూముల్లో కోర్టు కేసులు ఉన్న చోటా అధికారులు పనులు చేస్తుండటంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం మూడున్నర వరకు మండుటెండను లెక్క చేయకుండా బాధితులు ఆందోళన కొనసాగించారు.

Etv Bharat
Etv Bharat

Officials Try To Leveling land in Mudapaka Jagananna Colony : జగనన్న కాలనీల కోసం కోర్టు వివాదాల్లో ఉన్న భూముల్లోనూ పనులు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం చూపుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా భూమి చదును చేసేందుకు యత్నించడంతో ఎస్సీ బాధితులు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతున్న తమను రెవెన్యూ సిబ్బంది దుర్భాషలాడారంటూ బాధితులు వాపోయారు.

కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారులు :విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో జగనన్న ఇళ్ల స్థలాల కోసం సమీకరించిన భూముల్లో కోర్టు కేసులు ఉన్న చోటా అధికారులు పనులు చేస్తుండటంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎస్సీ కుటుంబానికి చెందిన చెన్నా రాములమ్మ, గీత, అప్పల రాజుకు ముదపాకలో రెండు ఎకరాల స్థలం ఉంది.

ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు :బుధవారం వీరి భూములకు సమీపంలో తొలుత భూమి చదును, బోర్ల తవ్వకం పనులు చేపట్టిన సిబ్బంది. ఆ తర్వాత వీరి భూముల వైపు రావడంతో అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలు ఉండగా ఎలా వస్తారంటూ బాధితులు ప్రశ్నించారు. సహాయ సర్వేయర్ గోవింద్ బాధితుల భూముల్లో చదును చేయాల్సిందేనని పట్టుబట్టగా వారు ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సిబ్బంది మళ్లీ గురువారం ఉదయం యంత్రాలతో పనులు ప్రారంభించడంతో బాధిత కుటుంబం నిరసనకు దిగింది.

Jagananna Colonies చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు.. ముంపు ప్రాంతాల్లో ఇళ్లపై ఆందోళన

సాగుదారు భూములపై హక్కు.. కోర్టు తుది తీర్పు : ముదపాక ఎస్సీ రైతుల సాగుదారు భూములపై హక్కు కల్పించండంటూ సీఎం చిత్రంతో కూడిన ఫ్లెక్సీలతో నిరసనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం మూడున్నర వరకు మండుటెండను లెక్క చేయకుండా బాధితులు ఆందోళనకొనసాగించారు. తహసీల్దారు శ్యామ్‌ అక్కడికి చేరుకొని, గుత్తేదారులతో పనులు ఆపించి యంత్రాలను అక్కడి నుంచి పంపించేశారు. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఆ భూముల్లో పనులు చేపట్టబోమని తెలియజేశారు.

ఇళ్లు కట్టకుండానే.. బిల్లుల చెల్లింపు! కడప ఎర్రగుంట్ల జగనన్న కాలనీ అక్రమాలపై విచారణ

సహాయ సర్వేయర్​పై కేసు నమోదు.. : సహాయ సర్వేయర్ దుర్భాషలాడటంపై పోలీసు కమిషనర్‌కు వాట్సప్ ద్వారా రాములమ్మ ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ సైతం నీకు కోర్టే భూమి ఇస్తాది తీసుకుందువు గానీ అంటూ వ్యాఖ్యలు చేశారని ఆమె వాపోయారు. సహాయ సర్వేయర్‌ గోవింద్‌ పై కేసు నమోదు చేయాలని రాములమ్మ కోరారు. నష్ట పరిహారంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను మాకు ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని బాధితులు తెలిపారు.

ముదపాక జగనన్న కాలనీలో అధికారుల అత్యుత్సాహం

ఇవీ చదవండి

Last Updated : Jun 3, 2023, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details