ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెట్రోల్​ పోసుకొని తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 15, 2020, 11:17 AM IST

కుంటుంబ కలహాలో మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. తన కొడుకుతో కలసి పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన వీరిని ఆసుపత్రికి తరలించారు.

Mother and son attempt suicide at anakapalli in visakhapatnam district
Mother and son attempt suicide at anakapalli in visakhapatnam district

పెట్రోల్​ పోసుకొని తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం

ఓ తల్లి తన రెండేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. భీమునిగుమ్మంలో నివాసముంటున్న దుప్పాడ సునీత తన రెండున్నరేళ్ల హృదయ్​తో కలిసి పెట్రోల్ పొసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే తల్లి, కూమారుడు 80 శాతానికి పైగా కాలిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్​కి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details