ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పత్రికలు, టీవీలకు మావోయిస్టుల లేఖ

By

Published : Sep 19, 2019, 1:55 AM IST

విశాఖ ఈస్ట్, మల్కన్​గిరి అంశంపై మావోయిస్టు డివిజనల్ కార్యదర్శి  అరుణ స్పందించారు. ఇవి రెండు కమిటీలు కావని...ఒకటే డివిజనల్ కమిటీ అని స్పష్టం చేస్తూ పత్రికలు, టీవీలకు లేఖ విడుదల చేశారు.

పత్రికలు, టీవీలకు మావోయిస్టుల లేఖ

పత్రికలు, టీవీలకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విశాఖ ఈస్ట్, మల్కన్‌గిరి అని 2 కమిటీలు లేవని...ఇప్పుడు ఒకటే డివిజనల్ కమిటీ ఉందని... ఇందులో గందరగోళం ఏం లేదని డివిజనల్ కార్యదర్శి అరుణ స్పష్టం చేశారు. ఏవోబీ జోన్‌లో కీలకంగా ఉన్న ఈస్ట్ ఉద్యమం... కూంబింగ్ నిర్బంధాలతో ఉందని తెలిపారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని ఉన్నా...సాధ్యం కావడం లేదన్నారు. ఆడియో టేపుల ద్వారా కొన్ని అంశాలు వివరిస్తామని అరుణ వెల్లడించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాం నగర పంచాయతీ కమిషనర్ నల్లి రమేష్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టారు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో రాజాం నగర పంచాయతీ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. గంట కాల వ్యవధిలో 45 మంది ఫోన్ ఇన్ కార్యక్రమం లో పాల్గొని సమస్యలను వివరించారు . రాజాం నగర పంచాయతీ పరిధిలో త్రాగునీటి సమస్య లు, పారిశుధ్యం, వీధి దీపాలు, తో పాటు పలు సమస్యలను తెలియజేశారు కమిషనర్ స్పందించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు


Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో నగర పంచాయతీ కమిషనర్ తో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ఫోన్ ఇన్ కార్యక్రమాలను నిర్వహించారు


Conclusion:శ్రీకాకుళం జిల్లా రాజాంలో నగర పంచాయతీ కమిషనర్ తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు

ABOUT THE AUTHOR

...view details