ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు

By

Published : Apr 5, 2021, 10:24 PM IST

విశాఖపట్నం జిల్లా జీకే వీధిలో మావోయిస్టు మిలీషియా సభ్యుడు లొంగిపోయాడు.

Maoist militia member surrendered to police in gkveedhi vizag district
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు

మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యుడిగా పనిచేస్తున్న పాంగి సోముర... లొంగిపోయినట్లు విశాఖపట్నం జిల్లా జీకే వీధి సీఐ మురళీధర్ తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో జీకే వీధి మండలం గొందులపనస గ్రామానికి చెందిన సోముర.. కొంతకాలంగా మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇటీవల మండలంలో పిల్కు అనే గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చడంపై సోముర మనస్థాపం చెంది లొంగిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. సోమురపై కేసు నమోదు చేయకుండా పంపిస్తున్నట్లు సీఐ మురళీధర్ తెలిపారు. మావోయిస్టులు లొంగిపోతే వారిపై కేసులు నమోదు చేయబోమన్నారు.

ABOUT THE AUTHOR

...view details