ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రుచికరమైన మాడుగుల హల్వా తయారీకి సిద్ధం

By

Published : Jun 7, 2021, 3:28 PM IST

విశాఖ మాడుగుల ప్రాంతం హల్వా తయారీకి ప్రసిద్ధి. రుచికరమైన ఈ స్వీట్​ని తయారు చేస్తూ.. ఎంతో మంది వ్యాపారులు అక్కడ ఉపాధిని పొందుతుంటారు. కరోనా కారణంగా వాటికి గండి పడింది. తాజాగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టటంతో వ్యాపారులు తిరిగి హల్వా తయారీని ప్రారంభించారు.

Madugula halwa
మాడుగుల హల్వా

విశాఖ జిల్లా మాడుగులలో హల్వా దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ ప్రాంతంలో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో హల్వా వ్యాపారులు.. రెండు వారాలు పాటు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రస్తుతం కొవిడ్ కేసులు కాస్త తగ్గడంతో వ్యాపారులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో హల్వా వ్యాపారం పెద్దఎత్తున జరిగేది. ప్రస్తుతం కరోనా కారణంగా అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details