ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాచ్​ఖండ్​కు మహర్దశ... జనరేటర్ల ఆధునీకరణకు సన్నాహాలు

By

Published : Dec 23, 2020, 10:29 AM IST

ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు అందిస్తోన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్తు కేంద్రానికి మంచి రోజులు రానున్నాయి. గత 65 ఏళ్లుగా నిర్విరామంగా విద్యుత్తు ఉత్పాదన జరుపుతూ పదే పదే మరమ్మతులకు గురవుతున్న జనరేటర్ల ఆధునీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు.. రెండు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

generators
జనరేటర్ల ఆధునీకరణకు సన్నాహాలు

ఆంధ్రపదేశ్​తో పాటు ఒడిశాకు విద్యుత్​ అందిస్తున్న మాచ్​ఖండ్​ జలవిద్యుత్​ కేంద్రానికి మహర్దశ పట్టనుంది. గత కొంత కాలంగా తరచూ మరమ్మతులకు గురవుతున్న జనరేటర్లను ఆధునీకరించేందుకు ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. అక్టోబరులోనే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నాతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.

ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మాచ్‌ఖండ్‌ ఆధునీకరణతో పాటు దిగువన ఉన్న లోయర్‌ మాచ్‌ఖండ్‌, ఎగువన ఉన్న జోలాపుట్‌ మిని జలవిద్యుత్తు కేంద్రాల నిర్మాణానికీ మార్గం సుగుమం కానుంది. ఈ పనులు పూర్తైతే విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం 120 నుంచి 150 మెగావాట్లకు పెరగే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details