ఆంధ్రప్రదేశ్

andhra pradesh

visaka steel plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నేనే కొంటా: కేఎ పాల్

By

Published : Apr 19, 2023, 6:04 PM IST

Updated : Apr 19, 2023, 6:15 PM IST

Visakhapatnam steel plant latest news: విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అందరూ కలసి రావాలని.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా న్యాయ పోరాటం చేస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందన్న పాల్.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అవసరమైతే తానే కొంటానని వ్యాఖ్యానించారు.

visaka steel plant:
visaka steel plant:

Visakhapatnam steel plant latest news: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, ప్రజలు, కార్మికులు కలిసి రావాలని.. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, సీబీఐ మాజీ జేడీ నారాయణలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. విశాఖలోని కన్వెన్షన్ సెంటర్‌లో నేడు కేఏ పాల్, వి.వి లక్ష్మీ నారాయణలు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ..''విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో నేను మూడు నిర్ణయాలు తీసుకున్నాను. అందులో మొదటిది.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకూడదు. రెండవది..ప్రైవేటీకరణ పేరుతో స్టీల్‌ప్లాంట్‌ను ఆదానీ, అంబానీలకు అమ్మకూడదు. మూడవది.. ఒకవేళ స్టీల్‍‌ప్లాంట్‌ను అమ్మాలని అనుకుంటే మా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేయండి.. ఏ పార్టీ గవర్నమెంట్‌ ఉన్నా దానిని మేము నిష్పక్షపాతంగా నడిపించుకుంటామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది విశాఖపట్టణంలోనే.. మా ఉరిలో ఉన్న సంస్థలను పక్కవారికి అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకోము. కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం'' అని ఆయన అన్నారు.

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై కేఏ పాల్​, సీబీఐ జేడీ లక్ష్మినారాయణ మీడియా సమావేశం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కాకుండా దిల్లీలో ఉన్న పెద్దలతో పోరాటం చేస్తానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ దాదాపు 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ఏర్పడిందని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో వైసీపీ సభ్యులు ఉండి కూడా స్టీల్‌ప్లాంట్ విషయంలో సీఎం జగన్ ఏం చేయగలిగరని కేఏ పాల్ ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమ్ముతామంటే అడిగిన దానికి ఎక్కువ చెల్లించి తానే కొంటానని కేఏ పాల్ పేర్కొన్నారు.

వచ్చే నెలలో టెస్లా అధినేత ఎలెన్ మస్క్ హైదరాబాద్‌కు విచ్చేస్తున్నారని.. ఆయన కుడా విరాళాల సేకరణకి ముందుకు వస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. రానున్న రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రజా శాంతి పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు 99శాతం ప్రక్రియ జరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం గతకొన్ని నెలలుగా స్టీల్‌ప్లాంట్ విషయంలో నాటకాలు ఆడుతోందని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల స్టీల్ డిమాండ్ ఉందని.. ఇంకా 8 వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాల్సి ఉందని.. సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీ నారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగా ఉండాలని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరితో కలిసి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయమ ఆరోపించారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 19, 2023, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details