ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ-20.. అభిమానుల ఆరోపణల్లో నిజం లేదు !

By

Published : Jun 14, 2022, 4:20 PM IST

విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో T-20కి సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. సమీప ప్రాంతాల్లోని క్రికెట్ అభిమానుల కోసం అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

అభిమానుల ఆరోపణల్లో నిజం లేదు !
అభిమానుల ఆరోపణల్లో నిజం లేదు !

విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ జరగబోయే మూడో టీ-20 మ్యాచ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. బీసీసీఐ నియమ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ పిచ్​ను రూపొందించినట్లు ఏసీఏ ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు. కొవిడ్ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ మ్యాచ్ నిర్వహించకపోవటం వల్ల ఇవాళ మ్యాచ్​కు భారీ స్థాయిలో అభిమానులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఏసీఏ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే ఆన్​లైన్ ద్వారా ఆఫ్​లైన్ ద్వారా 27 వేల టిక్కెట్లు అమ్మినట్లు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో టికెట్లు అమ్మలేదని అభిమానుల నుంచి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఏసీఏ ట్రెజరర్ గోపీనాథ్ రెడ్డి అన్నారు. వర్షం వచ్చినా సరే అరగంటలో మళ్లీ మ్యాచ్ మొదలయ్యే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మ్యాచ్​కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం 5 గంటల నుంచి వాహనాలను దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details