ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Maoist avirbhava dinotsavam: ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు.. భారీగా పాల్గొన్న గిరిజనులు

By

Published : Sep 23, 2021, 12:19 PM IST

Updated : Sep 23, 2021, 2:54 PM IST

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల(Maoist avirbhava week-celebrations)లను నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరులు నిర్వహించిన ప్రజా మేళిలో గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు, ఒడియా భాషాలతో రాసిన బ్యానర్లు పట్టుకొని ర్యాలీ తీశారు. జల్‌జంగల్‌, జమీన్‌లపై గిరిజనులు గళమెత్తారు. మావోయిస్టుల మిలీషియా కమాండర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Maoist avirbhava dinotsavam
మావోయిస్టు వారోత్సవాలు

ఏవోబీలో మావోయిస్టు వారోత్సవాలు

మావోయిస్టు(Maoist) సానుభూతిపరుల ఆధ్వర్యంలో ఏవోబీలో ఆవిర్భావ దినోత్సవం(Maoist avirbhava dinotsavam) నిర్వహించారు. గిరిజనుల అసలైన హక్కుల కోసం పోరాటాలు జరుపుతున్న మావోయిస్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేతకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. పోలీసులు.. కూంబింగ్‌ పేరిట ఆదివాసి మహిళలను వేధిస్తున్నారని.. మావోయిస్టుల జాడ చెప్పమని గ్రామాల్లో యువకులపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో కనీస మౌళిక వసతులు కల్పించకుండా ఇంకా ఎన్నేళ్లు ఇలా మోసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈ మేళిలో భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. మొదట మావోయిస్టుల స్థూపం వద్ద అమరులైన వారికి నివాళులు అర్పించారు. అనంతరం మావోయిస్టుల జెండాను ఎగురవేశారు. తెలుగు, ఒడియా భాషాలతో రాసిన బ్యానర్లు పట్టుకొని ర్యాలీ తీశారు. జల్‌జంగల్‌, జమీన్‌లపై గిరిజనులు గలమెత్తారు. జననాట్యమండలి ఆధ్వర్యంలో మావోయిస్టులు పాటలు పాడారు.

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల(Maoist avirbhava week-celebrations) సందర్భంగా.. ఏవోబీలో బీఎస్‌ఎఫ్‌(BSF CAMP AT AOB) పోలీసులు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల మిలిషియా కమాండర్ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒక వైపు ఆంధ్ర- ఒడిశా రాష్ట్రాల్లో కూంబింగ్‌, పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నప్పటికీ మావోయిస్టులకు గిరిజనులు మద్దతు పలకడం విశేషం.

ఏవోబీలో ముమ్మర తనిఖీలు

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు(bsf checking at aob) ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవుల్లో గాలింపు చేపడుతున్నాయి. ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్‌ కావడం తదితర సంఘటనలతోపాటు ఏవోబీలో రెండుసార్లు ఎదురుకాల్పులు జరగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గూడెంకొత్తవీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి..

Last Updated :Sep 23, 2021, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details