ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు: సీపీఐ నేత నారాయణ

By

Published : Nov 25, 2022, 2:47 PM IST

Updated : Nov 25, 2022, 8:25 PM IST

NARAYANA VISIT RUSHIKONDA
NARAYANA VISIT RUSHIKONDA

NARAYANA VISIT RUSHIKONDA : విశాఖ రుషికొండలో ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైకోర్టు అనుమతి మేరకు.. రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ కట్టడాల వల్ల రుషికొండ.. తన సహజ అందాన్ని కోల్పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండపై పర్యాటకుల విల్లాలు నిర్మిస్తున్నారని.. మిడిమిడి జ్ఞానం ఉన్న మంత్రులు మాట్లాడటం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్పారు.

CPI NARAYANA VISIT RUSHIKONDA : విశాఖ జిల్లా రుషికొండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. రుషికొండలో నిర్మాణాల పరిశీలన కోసం..ఆగస్టులోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇచ్చింది. రుషికొండను సందర్శించాలని.. ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వల్ల కుదరలేదు. ఆ తర్వాత.. మళ్లీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాలేదు. మళ్లీ కోర్టుకెళ్లడంతో రుషికొండను సందర్శించడానికి అనుమతివచ్చింది.

కోర్టు ఆదేశాలతో రుషికొండ పర్యటనకు ఆయన బయల్దేరడంతో.. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనదారుల్ని నిలిపేశారు. నారాయణ వాహనాన్ని గీతం వర్సటీ జంక్షన్‌లో ఆపివేశారు. కోర్టు అనుమతి మేరకు నారాయణ ఒక్కరినే.. రుషికొండ పర్యటనకు అనుమతించారు. వాహనంలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతలను దిగిపోవాలని పోలీసులు సూచించారు.

రుషికొండ పర్యటన అనంతరం.. అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. విలాసవంతమైన భవనాల పేరిట ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లాలు ఎక్కడైనా కట్టుకోవచ్చన్న నారాయణ.. కట్టడం చట్టప్రకారమైనా కొండను తొలిచేయడం నేరం అన్నారు. ఈ నిర్మాణాల్లో అధికారులు కూడా రాత్రికి బస చేసే అనుమతిలేదని.. కేవలం పర్యాటకులు ఉండేందుకు వీలుగా విల్లాలు నిర్మిస్తున్నారని తెలిపారు. మిడిమిడి జ్ఞానం ఉన్న మంత్రులు మాట్లాడటం వల్లే ఇంతవరకు వచ్చిందని పేర్కొన్నారు.

"ఆగస్టులో రుషికొండ సందర్శనకు హైకోర్టును ఆశ్రయించా. 3 నెలలు పట్టినా నాకు అవకాశం ఇవ్వలేదు. మళ్లీ కోర్టుకు వెళ్లడంతో ఇవాళ చూసేందుకు అనుమతిచ్చారు. రుషికొండలో విలాసవంతమైన భవనాలు కడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. కృతిని నాశనం చేసిన పాపం మాత్రం ఊరికే పోదు. విల్లాలు ఎక్కడైనా కట్టుకోవచ్చు. కట్టడం చట్టప్రకారమైనా.. కొండను తొలిచేయడం మాత్రం నేరం. ఈ నిర్మాణాల్లో అధికారులు కూడా రాత్రి బస చేసే అనుమతి లేదు. కేవలం పర్యాటకులు ఉండేందుకు విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నారు" -సీపీఐ నేత నారాయణ

ప్రకృతిని నాశనం చేసిన పాపం ఊరికే పోదు

ఇవీ చదవండి:

Last Updated :Nov 25, 2022, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details