ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Visakha CP On Ganja : 'గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.. విక్రయిస్తే పీడీ యాక్ట్'

By

Published : May 10, 2023, 1:42 PM IST

Visakha CP Talks On Ganja In Meeting: గంజాయి సాగు, అక్రమ రవాణాపై విశాఖ రేంజ్​లో ఉన్న ఐదుగురు ఎస్పీలతో పాటు డీఐజీ నేతృత్వంలో విశాఖ కమిషనరేట్​లో సీపీ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్​లో పండిస్తున్న గంజాయి దేశ వ్యాప్తంగా రవాణా జరుగుతోందని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.

CP Trivikrama Verma meeting on ganja in Visakha
విశాఖలో గంజాయిపై సీపీ త్రివిక్రమ వర్మ సమావేశం

గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తాం..అమ్మకందారులపై పీడీ యాక్టు

Visakha CP Talks On Ganja In Meeting : గంజాయి సాగు, అక్రమ తరలింపు, వినియోగం నియంత్రణపై విశాఖ రేంజ్​లో ఉన్న ఐదుగురు ఎస్పీలతో డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో విశాఖ కమిషనరేట్​లో సీపీ త్రివిక్రమ వర్మ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గంజాయిపై వారి వారి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్​లో పండిస్తున్న గంజాయి దేశ వ్యాప్తంగా రవాణా జరుగుతోందని తెలిపారు.

హోటళ్లకి నోటీసులు.. ఉక్కుపాదం మోపాం : రెండు రోజుల క్రితం 450 కేజీల గంజాయిని పట్టుకున్నామని ఆ గంజాయి ఒడిశా నుంచి వచ్చినట్టు గుర్తించామని త్రివిక్రమ వర్మ అన్నారు. ఒడిశా నుంచి ఢిల్లీకి ఈ గంజాయి రవాణా జరుగుతుంటే అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఏడాదిలో 333 మందిని గంజాయి కేసులలో అరెస్ట్ చేశామన్నారు. దువ్వాడలో గంజాయి సేవిస్తున్న వారిని సోమవారం పట్టుకున్నామని, వారికి ఒడిశా లింక్ ఉన్నట్టు తెలుస్తోందన్నారు. నగరంలో ఉన్న 515 హోటళ్లకి నోటీసులు ఇచ్చామని సీపీ తెలిపారు. కొత్తగా వచ్చిన వారిని వెంటనే చెకింగ్ చేయాలని చెప్పామన్నారు. మొత్తం గంజాయి ఒడిశా నుంచి వస్తుందని, దాని పై ఉక్కుపాదం మోపామని, అందుకే కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని ఆయన అన్నారు.

గంజాయిపై విద్యార్థులకు అవగాహన : సోమవారం 700 మంది విద్యార్థులతో గంజాయిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. పెడ్లర్​ల మీద ఫోకస్ మీద పెట్టామన్నారు. యాక్టివ్​లో ఉన్న పెడ్లర్​ల మీద పీడీ యాక్ట్ పెట్టేందుకు సిద్దమయ్యామన్నారు. ఐదు జిల్లాలతో కనెక్ట్ అయ్యే చెక్ పోస్టులను అలర్ట్ చేశామని సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.

గంజాయి పంట పండించడం చట్ట రీత్యా నేరం : విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని గంజాయి కేసులు, అరెస్టుల వివరాలను వెల్లడించారు. 2021-2022లో 7 వేలకి పైగా గంజాయి పంటను నాశనం చేశామని, గత ఏడాది కూడా అల్లూరి జిల్లాలో గ్రామాలలో గంజాయి పంటను నాశనం చేశామన్నారు. గ్రామాలలో గంజాయి పంట పండించడం చట్ట రీత్యా నేరమని చెబుతూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

శాటిలైట్ ఇమేజెస్ కూడా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జనవరి నెలలో గ్రామాలలో గంజాయి కాకుండా వేరే పంటలు పండించడానికి అనేక మార్గాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఒడిశా నుంచి ఈ గంజాయి ఎక్కువ వస్తుందని గుర్తించామని, దేశ వ్యాప్తంగా అనేక చోట్లకు ఈ ఒడిశా నుంచి గంజాయి వెళ్తున్నట్టు తెలుస్తుందన్నారు. ఒడిశా పోలీసులకి కూడా సమాచారం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.

"విశాఖ రేంజ్​లో ఉన్న ఐదుగురు ఎస్పీలతో పాటు డీఐజీతో జాయింట్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఒడిశాలో పండిస్తున్న గంజాయి వివిధ మార్గాల ద్వారా విశాఖకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. దీనిని కట్టడి చేయడానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశాము. 450 గంజాయి పట్టుకోవడం జరిగింది. ఆ గంజాయిని ఒరిస్సా నుంచి తీసుకువచ్చారని తెలిసింది."- త్రివిక్రమ వర్మ, విశాఖ నగర పోలీసు కమిషనర్

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details