ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజృంభిస్తున్న మహమ్మారి.. చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

By

Published : May 4, 2021, 12:31 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు. వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని రోజుకు రెండు మార్లు పిచికారి చేస్తున్నారు.

corona at narsipatnam
corona at narsipatnam

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఛైర్ పర్సన్ ఆదిలక్ష్మి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. రెండు వాహనాలతో రోజుకు రెండు సార్లు పాజిటివ్ కేసులు ఉన్న చోటే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ పిచికారి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కనకారావు అన్నారు. దీనికి తోడు బ్లీచింగ్ చల్లి ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details