ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నర్సీపట్నంలో కరోనా అవగాహన సదస్సులు

By

Published : Apr 26, 2021, 12:27 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్​ పరిధిలో మండలాల్లో కేసులు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు.

Corona Awareness programs
కరోనా అవగాహానా సదస్సులు

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని రామారావుపేట, పెద్ద బొడ్డేపల్లి ప్రాంతాల్లో కొవిడ్​పై అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. డివిజన్​ పరిధిలోని మాకవరపాలెం మండలానికి సంబంధించి బూరుగు పాలెం గ్రామంలో ఒకే రోజు 14 కరోనా బాధితులను వైద్య సిబ్బంది గుర్తించారు. రోలుగుంట మండలంలో మరో 17 కేసులు నమోదయ్యాయి. దీంతో నర్సీపట్నంలోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

కేసులు విజృంభిస్తున్న కారణంగా మాకవరపాలెంలో ఉదయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరవాలని వ్యాపారులు నిర్ణయించారు. రావికమతం మండలం కొత్తకోటలోనూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వచ్ఛంద లాక్​ డౌన్​ను పాటిస్తున్నారు. మరోపక్క ఆయా మండలాల్లో అటు అధికారులతో పాటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండీ..ఇళ్లలోనే 60 వేల మంది.. కానీ వారికి కొవిడ్ వైద్యమేది?

ABOUT THE AUTHOR

...view details