ఆంధ్రప్రదేశ్

andhra pradesh

DWIVEDI: 'లేటరైట్ తవ్వకాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదు'

By

Published : Jul 10, 2021, 6:01 PM IST

Updated : Jul 10, 2021, 6:17 PM IST

అల్యూమినియం(aluminium) తయారీలో వినియోగించే బాక్సైట్(bauxite), లేటరైట్(laterite) తవ్వకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని గనులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది(gk.dwivedi) వెల్లడించారు. అనుమతుల ప్రకారమే మైనింగ్(mining) జరుగుతోందని తెలిపారు. అక్రమ మైనింగ్​కు పాల్పడిన వారికి జరిమానా విధించామన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులపై చర్యలు(action) తీసుకుంటామని ద్వివేది స్పష్టం చేశారు.

నులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది
నులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది

నులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది

లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదని గనులశాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది తెలిపారు. జీఎస్​ఐ అనుమతి మేరకు విశాఖ జిల్లాలోని నాతవరం మండలంలో లేటరైట్ తవ్వకాలకు మొత్తం 6 లీజులకు అనుమతి ఇచ్చినట్లు జి.కె.ద్వివేది తెలిపారు. ఇందులో ఒక లీజు గడువు ముగిసిందని, అప్రోచ్ రోడ్డు లేక మరో 2 లీజుల్లో తవ్వకాలు జరగడం లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఒక లీజులో 5 వేల టన్నులకే అనుమతి ఇచ్చామన్నారు.

అనుమతి పునరుద్ధరణ..

అక్రమ మైనింగ్​కు పాల్పడిన సింగం భవాని, లోవరాజుకు రూ.19 కోట్ల జరిమానా విధించినట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది వెల్లడించారు. వీరు 2 లక్షల టన్నుల మైనింగ్‌ చేశారని గుర్తించి, జరిమానా విధించామన్నారు. 2018లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు 2019లో అనుమతిని పునరుద్ధరించినట్లు జి.కె.ద్వివేది పేర్కొన్నారు.

లీజులపై కోర్టు వివాదాలు..

తనిఖీలు చేశాక 2 గనుల్లో ప్రస్తుతం మైనింగ్‌ జరగడం లేదని, లేటరైట్‌కు సంబంధించి 5 వేల టన్నులకే అనుమతి ఉందని స్పష్టం చేశారు. కొన్ని మైనింగ్‌ లీజులపై కోర్టు వివాదాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని లీజుదారులకు జరిమానా విధించినట్లు ద్వివేది స్పష్టం చేశారు.

ఆ మైనింగ్ యోచన లేదు..

విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్‌ చేసే యోచన లేదని జి.కె. ద్వివేది వెల్లడించారు. అన్‌రాక్‌ పరిశ్రమకు ఒడిశా నుంచి బాక్సైట్ సరఫరాకు ప్రయత్నిస్తున్నామని.. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలు జరపబోమని వ్యాఖ్యానించారు.

ఇవీచదవండి.

Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం

'మూడో దశ ముందే వచ్చాం.. భయమెందుకు?'

Gambusia fishes: దోమలకు చేపలతో చెక్.. ఎలాగంటే !​

Last Updated : Jul 10, 2021, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details