ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN: ప్రశాంతతకు మారుపేరైన విశాఖ.. క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయింది: చంద్రబాబు

By

Published : Nov 6, 2021, 5:15 PM IST

విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు డీజీపీ సవాంగ్​కు లేఖ రాశారు. లైన్‌మెన్‌ బంగార్రాజు దారుణ హత్యకు గురై 5 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పోస్టుమార్టం నిర్వహించలేదన్నారు. హత్యలో అధికార వైకాపాకి చెందిన అగ్రనేతల ప్రమేయం ఉందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు ఆరోపించారు.

డీజీపీకి చంద్రబాబు లేఖ
డీజీపీకి చంద్రబాబు లేఖ

ప్రశాంతతకు మారుపేరైన విశాఖ.. నేడు అక్రమ భూకబ్జాలు, హత్యలతో క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో హత్యకు గురైన.. విద్యుత్ లైన్​మెన్ బంగార్రాజు మృతిపై డీజీపీ గౌతం సవాంగ్​కు ఆయన లేఖ రాశారు. ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైందని..మృతదేహం లభ్యమై 5 రోజులైనా ఇప్పటికీ పోస్ట్‌మార్టం నిర్వహించకపోవటం విచారకరమని ఆక్షేపించారు.

హత్యలో అధికార వైకాపాకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

ABOUT THE AUTHOR

...view details