ఆంధ్రప్రదేశ్

andhra pradesh

cannabis seized: గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు

By

Published : Nov 3, 2021, 10:20 PM IST

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

cannabis seized
cannabis seized

విశాఖ జిల్లా మాడుగుల పోలీసులు గంజాయి పట్టుకున్నారు. మాడుగుల మండలం తాటిపర్తి చెక్​ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. కారులో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని పట్టుకుని... ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాటుసారా, గంజాయితో పట్టుబడిన నిందితులపై రౌడీషీట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details