ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు చుక్కెదురు

By

Published : Feb 3, 2023, 7:32 AM IST

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్.. విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలెంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి గ్రామానికి రాకుండా అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పలువురు అడ్డుకున్నారు.

భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌
భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌

భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌

Avanti sirinivas : విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు చుక్కెదురైంది. ఎమెల్యే తమ గ్రామానికి రాకుండా టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు చెప్పుల దండను తొలగించారు. సూరిబాబును అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా.. నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు మరుపల్లి రాజేంద్ర, యువకులు అడ్డుకున్నారు.

అనంతరం గడప గడపకు కార్యక్రమాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న రాజేంద్రను స్థానిక వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌తోపాటు... ఆ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణగడంతో ఎమ్మెల్యే తన కార్యక్రమాన్ని కొనసాగించారు. చెప్పులు కట్టిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తుంటే తానే వద్దని చెప్పానని.. అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. తాను ఎవరి జోలికెళ్లనని.. తన జోలికొస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details