ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మత్స్యకారులకు తీరప్రాంత భద్రతపై అవగాహన

By

Published : Dec 10, 2020, 8:19 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ చేపలుప్పాడలో మత్స్యశాఖ, తీరప్రాంతం రక్షణదళం ఆధ్వర్యంలో మత్స్యకారులకు వేటకు వెళ్లే సమయంలో పాటించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.

మత్స్యకారులకు తీరప్రాంత భద్రతపై అవగాహన
మత్స్యకారులకు తీరప్రాంత భద్రతపై అవగాహన

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ చేపలుప్పాడలో మత్స్యశాఖ, తీరప్రాంతం రక్షణదళం ఆధ్వర్యంలో మత్స్యకారులకు తీరప్రాంత భద్రతపై అవగాహన కల్పించారు. తీరప్రాంత రక్షకదళం డీఎస్​పీఆర్ గోవిందరావు, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావుతో కలిసి మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో పాటించాల్సిన పలు అంశాలపై సూచనలు చేశారు. రింగ్ నెట్​ల వినియోగంలో ఉన్న నిషేధిత అంశాలను వివరించారు. స్థానిక ఒప్పంద అంశాలను తెలిపారు. వలకన్ను సైజు అర అంగుళం కంటే ఎక్కువ ఉండటం వంటి చట్టంలోని అంశాలపై అవగాహన కల్పించారు. బోట్ల కలర్ కోడ్, రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details