ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటు వేసేందుకు వెళ్తుండగా జీపు బోల్తా.. 15 మందికి గాయాలు

By

Published : Feb 17, 2021, 4:46 PM IST

ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా జీపు బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. విశాఖ ఏజెన్సీలో ఈ ప్రమాదం జరిగింది.

accident
ఓటు వేసేందుకు వస్తుండగా జీపు బోల్తా.. 15మందికి గాయాలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తుండగా జీపు బోల్తా పడిన ఘటనలో 15 మందికి గాయలయ్యాయి. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో ఓటు వేసేందుకు ఉబ్బెడ గ్రామం నుంచి 20 మంది లక్ష్మీపురానికి బయల్దేరారు.

మలుపు వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రిని తరలించారు. వీరిలో తీవ్రంగా ఐదుగురిని పాడేరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. జీపు ప్రమాదం జరగటంతో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details