ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డీజీపీ పేరిట.. ట్విటర్‌లో నకిలీ ఖాతా!

By

Published : May 31, 2021, 9:31 AM IST

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ట్విటర్‌లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం ట్విటర్‌కు ఫిర్యాదు చేసి ఈ ఖాతాను స్తంభింపజేసింది.

fake twitter account on name of AP dgp
fake twitter account on name of AP dgp

రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కూ సైబర్‌ నేరగాళ్ల బాధ తప్పలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ‘డీజీపీ ఆంధ్రప్రదేశ్‌’ పేరిట ట్విటర్‌లో ఆదివారం ఓ నకిలీ ఖాతాను ప్రారంభించారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చిత్రాన్ని ఆ ఖాతాకు డీపీగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ అధికారిక ఖాతా ఇది అని ట్విటర్‌ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. వరుసగా పలు ట్వీట్లు చేశారు. నకిలీ ఖాతా అనే విషయం గుర్తించకముందు పలు జిల్లాల ఎస్పీలు, ఇతరులు ఈ ట్విటర్‌ ఖాతాను అనుసరించారు.

అయితే.. అందులో వరుసగా చేసిన ట్వీట్లు అనుమానాస్పదంగా ఉండటంతో అది నకిలీ ఖాతాగా గుర్తించగలిగారు. విషయం తెలిసిన వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం ట్విటర్‌కు ఫిర్యాదు చేసి ఈ ఖాతాను స్తంభింపజేసింది. ఈ అంశంపై విజయవాడలోని సైబర్‌ నేరాల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏ ఐపీ చిరునామా నుంచి ఈ నకిలీ ఖాతాను ప్రారంభించారు? దీని వెనక ఎవరున్నారు? అనే అంశాలపై సైబర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details