ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తితిదే లడ్డు సైజు తగ్గిందేంటీ నాయనా!.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌

By

Published : Nov 11, 2022, 12:16 PM IST

TTD reaction: తిరుమల శ్రీవారి లడ్డు తితిదే నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ ఉందంటూ.. ఓ భక్తుడు చిత్రీకరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. తితిదే నిర్దేశించిన ప్రకారం ఒక్కో లడ్డు 160 నుంచి 180 గ్రాముల వరకు బరువు ఉండాలి. ఆ భక్తుడు తీసుకున్న లడ్డు 107 గ్రాములు, రెండో సారి వేసిన లడ్డు 93 గ్రాములు ఉన్నట్లు యంత్రంలో చూపించింది. దీంతో భక్తుడు తితిదేపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

TTD reaction
TTD reaction

TTD reaction on Srivari Laddu: తిరుమల శ్రీవారి లడ్డు తితిదే నిర్దేశించిన పరిమాణం కంటే తక్కువ ఉందంటూ... ఓ భక్తుడు తీసిన వీడియో వైరల్ గా మారింది. లడ్డూ కొనుగోలు చేసే సమయంలో వాటి బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చి ఓ భక్తుడు.. వాటిని తూకం వేయాలని సిబ్బందిని కోరారు. భక్తుడు కోరిక మేరకు వాటిని తూయగా... నిర్దేశించిన బరువు కంటే తక్కువగా కనిపించాయి. తితిదే ఒక్కో లడ్డు 160 నుంచి 180 గ్రాముల వరకు బరువు ఉండేలా నిర్దేశించింది. అయితే భక్తుడు తీసుకొన్న లడ్డు ప్రసాదాలను తూకం వేయగా ఒకటి 107 గ్రాములు, మరొకటి 93 గ్రాములు చూపించింది. భక్తుడు తితిదేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

భక్తుడు లడ్డు విక్రయ కేంద్రంలో చిత్రీకరించిన దృశ్యాలు వైరల్ కావడంతో తితిదే విజిలెన్స్ అధికారులు, లడ్డూ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి కేంద్రంలోకి వెళ్లి లడ్డూలను తూకం వేసి పరిశీలించారు. మరో వైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సాధారణంగా 160 నుంచి 180 గ్రాముల బరువు ఉంటుందని.. దీనిపై ఎలాంటి అపోహలు వద్దంటూ తితిదే ప్రకటన జారీ చేసింది. కొన్ని వందల సంవత్సరాలుగా పోటు కార్మికులు అత్యంత భక్తి శ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారని తెలిపింది. బరువు, నాణ్యత విషయంలో తితిదే రాజీపడలేదని తెలిపారు. లడ్డూ కౌంటర్ల వద్ద భక్తులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటనలో స్పష్టం చేసింది.

నిర్దేశించిన బరువు కంటే తక్కువగా శ్రీవారి లడ్డూ...

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details