ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారిని, కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్న సూపర్​స్టార్​ రజనీకాంత్​..

By

Published : Dec 15, 2022, 11:18 AM IST

Updated : Dec 15, 2022, 2:11 PM IST

HERO RAJINI AT TIRUMALA : తిరుమల శ్రీవారిని సినీ నటుడు రజనీకాంత్ దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. తిరుమల నుంచి ఆయన కడప దర్గకు వెళ్లారు.

SUPERSTAR RAJINIKANTH AT TIRUMALA
SUPERSTAR RAJINIKANTH AT TIRUMALA

SUPERSTAR RAJINIKANTH AT TIRUMALA : తిరుమల శ్రీవారిని సూపర్​స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్​తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. సూపర్​స్టార్​కి.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. మూలమూర్తిని దర్శించుకున్న సూపర్ స్టార్.. స్వామివారికి కానుకలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకొన్నారు. దర్శనానంతరం ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్​స్టార్​ రజనీకాంత్

కడప పెద్ద దర్గాను దర్శించుకున్న రజనీ: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌లు కడపలోని పెద్ద దర్గాను సందర్శించారు. సూపర్‌స్టార్‌ కుమార్తె ఐశ్వర్యతో పాటు, రెహమాన్ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. దర్గా ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖుల రాకతో పెద్ద దర్గా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

కడప పెద్ద దర్గాను దర్శించుకున్న రజనీ

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details