ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాబోయే మూడు రోజులు వర్షాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 9:40 PM IST

Heavy Rain Alert to Andhra Pradesh Till December 5th: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారి.. తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Heavy_Rain_Alert_to_Andhra_Pradesh_Till_December_5th
Heavy_Rain_Alert_to_Andhra_Pradesh_Till_December_5th

HeavyRain Alert to Andhra Pradesh Till December 5th :రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారి.. తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి.. శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది. డిసెంబరు మొదటి వారంలో తుపాను తీరం దాట వచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.

Low Pressure in Bay of Bengal :కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేశారు. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

AP Weather Report : గురువారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచన అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచన మారితుందని తెలుస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రావాలని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

Rain Alert to AP Till December 5th :రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదే రోజు బాపట్ల, పల్నాడు, నంద్యాల, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జల్లులు పడే సూచన ఉన్నట్లు తెలుస్తోంది.

దిల్లీవాసులకు ఊరట- మెరుగైన గాలి నాణ్యత, 387 పాయింట్లకు చేరిన ఏక్యూఐ!

HeavyRains in Andhra Pradesh :శుక్రవారం నాడు నెల్లూరు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అదే రోజు ప్రకాశం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో జల్లులు పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Heavy Rains in Tirupati District :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులపై వరద ప్రవాహం జరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏర్పేడు మండలంలోని ముసల పేడు సమీపంలో పంబకాలవకు వరద ప్రవహించడంతో శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడు కండ్రిక చెందిన సాయమ్మ(55) కాలువలో కొట్టుకుపోయి మృతి చెందింది. తొట్టంబేడు మండలంలోని చిత్తూరు సమీపంలో వాగులో వరద ప్రవాహం జరగడంతో నాలుగు మేకలు కొట్టుకుపోతుండగా స్థానికుల గుర్తించి సురక్షితంగా గట్టుకు చేర్చారు. శ్రీకాళహస్తి పల్లం రహదారిపై అక్కుర్తి సమీపంలో వరద ప్రవాహం జరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షం పెరగనుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

Heavy Rain In Kadapa City:భారీ వర్షం.. తడిసి ముద్దైన కడప నగరం.. ఇబ్బందుల్లో ప్రజలు..

ABOUT THE AUTHOR

...view details