ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా జడ్పీటీసీని తుపాకీతో బెదిరించిన దుండగులు

By

Published : May 17, 2022, 4:36 AM IST

Threatening ZPTC buchi babu in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో తెదేపా జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబును గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారు. ఈ క్రమంలో చాకచక్యంగా అక్కడినుంచి తప్పించుకున్న బుచ్చిబాబు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Threatening ZPTC buchi babu
జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబుకి బెదిరింపులు

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబును గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో బెదిరించారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జడ్పీటీసీ.. తన హోటల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు.. మేము పోలీసులమంటూ ఆయన్ను పిలిచారు. తనతో మీకు పనేంటని ప్రశ్నించడంతో తుపాకీతో బెదిరించారు. అప్రమత్తమైన బుచ్చిబాబు.. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జడ్పీటీసీ హోటల్​లో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు.. ఈ వారంలో ఇది రెండో సారి అని ఫిర్యాదులో బుచ్చిబాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details