ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Speaker Tammineni: ముందు మీరేం చేశారో చెప్పండి.. అప్పుడు మేం చెబుతాం: స్పీకర్ తమ్మినేని

By

Published : Jan 1, 2022, 9:43 PM IST

Speaker Tammineni Fire On Atchenna: తెదేపా హయంలో ఓటీఎస్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నను సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెబితే.. అప్పుడు తాము ఏం చేశామో చెబుతామని అన్నారు.

ముందు మీరేం చేశారో చెప్పండి.. అప్పుడు మేం చెబుతాం
ముందు మీరేం చేశారో చెప్పండి.. అప్పుడు మేం చెబుతాం

Speaker Tammineni Fire On Atchenna: శ్రీకాకుళం జిల్లా తెదేపా సర్వసభ్య సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై సభాపతి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెబితే.. అప్పుడు తాము ఏం చేశామో చెబుతామని అన్నారు. తెదేపా హయంలో ఓటీఎస్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదని అచ్చెన్నను సీతారాం నిలదీశారు.

అచ్చన్న ఏమన్నారంటే..
Atchenna Fire On Jagan Govt: ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ సర్కారు ప్రభుత్వ భూములను కూడా అమ్మేస్తోందని ధ్వజమెత్తారు.

ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందన్న అచ్చెన్న.. జగన్ తన పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వంగవీటి రాధా తన ఆవేదనను చెబితే.. తెదేపా వాళ్లు రెక్కీ నిర్వహించారని ఓ మంత్రి వ్యాఖ్యానించారని, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉండి ఇలా మాట్లాడటమేంటని నిలదీశారు. సినిమా రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు. ఓటీఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ చదవండి :

Atchenna Fire On Jagan: నేనెప్పుడూ ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని చూడలేదు: అచ్చెన్న

ABOUT THE AUTHOR

...view details