ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాగావళి నది చెంతనే ఉన్నా..తాగునీటికి తప్పని తిప్పలు

By

Published : Oct 20, 2020, 8:38 PM IST

గుక్కెడు నీటి కోసం నాగావళిలోకి పీకల్లోతుకు వెళ్లాల్సిందే..నది పక్కనే ఉన్నా సురక్షిత నీరు దొరకని దుస్థితి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం గడగమ్మ గ్రామస్థులది. తమకు తాగునీరు అందించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Nagavali River is very close to village .. but there are no fecilities for drinking water
నాగావళి నది చెంతనే ఉన్నా..తాగునీటికి తప్పని తిప్పలు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి సచివాలయం పరిధిలోని గడగమ్మ గ్రామ ప్రజలు నేటికీ తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ రోజుకీ గ్రామంలో రక్షిత తాగునీటి ట్యాంక్, ఇంటింటికి కుళాయి సదుపాయాలు లేవు. దీంతో ఏళ్ళ తరబడి తాగు నీటి కోసం పక్కనే ఉన్న నాగావళి నదిపై ఆధారపడుతున్నారు. ప్రాణాలు పక్కన పెట్టి పీకల్లోతు నీటిలో కొంత దూరం వెళ్లి నది మధ్య ఉన్న ఇసుక తెన్నుల వద్ద చెలములు తీసి తాగునీటిని సేకరిస్తున్నారు. వాటితో దాహం తీర్చుకుంటున్నారు. నది పక్కనే పారుతున్నా..సురక్షిత నీరు మాత్రం వీరికి కరువయ్యింది. ఈ గ్రామంలో 270 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా సాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details