ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫ్యాన్​కు ఉరి వేసుకుని.. ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఆత్మహత్య!

By

Published : Feb 16, 2022, 6:15 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వసతి గృహంలో ఉరి వేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

iiit student committed suicide at Etcherla
iiit student committed suicide at Etcherla

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురంలో ఐఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కొండపల్లి మనీషాఅంజు(16) అనే విద్యార్థిని వసతి గృహంలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 14న మనీషాఅంజుని తల్లి కరుణ కుమారి కళాశాల వద్ద దించి వెళ్లింది. 15వ తేదీన ఆరోగ్యం బాగా లేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో తండ్రి సూరిబాబు కళాశాలకు వచ్చి కుమార్తెకు ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇవాళ మనీషాఅంజు ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని కళాశాల సిబ్బంది వెల్లడించారు.

కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎప్పుడూ హుషారుగా ఉన్న అంజు మృతి చెందడంతో తోటి విద్యార్థులు కూడా తట్టులోకపోతున్నారు. ఈ ఘటనపై ఎచ్చెర్ల పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి

'ఆ ఎమ్మెల్యేను సీఎం జగన్ కొట్టారు' అంటూ పోస్టు.. రంగంలోకి పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details