ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తల్లిదండ్రుల గొడవ చిన్నారి ప్రాణం తీసింది

By

Published : Jun 29, 2019, 7:26 AM IST

తల్లిదండ్రుల మధ్య గొడవ చిన్నారి ఆయువు తీసింది. నిద్రపోతున్న చిన్నారికి క్రికెట్ బ్యాట్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

తల్లిదండ్రుల గొడవ చిన్నారి ప్రాణం తీసింది

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదం తమ కుమారుడి ప్రాణం తీసింది. స్థానికంగా నివాసముండే వినోద్- గీత దంపతులు శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. ఆ సమయంలో భార్య గీతపై భర్త వినోద్ క్రికెట్ బ్యాట్ విసిరాడు. ఆ బ్యాట్‌ ఆమెకు తగల్లేదు కదా... అక్కడే పడుకొని ఉన్న కుమారుడు దినేష్(9)కి పడింది. గాఢ నిద్రలో ఉన్న బాలుడు బాధతో విలవిలలాడిపోయి... స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు... బ్యాట్‌ తగలడంతో... ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు నిర్థరించారు. కాశీబుగ్గ ఎస్​ఐ రమేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రుల గొడవకు బాలుడి ప్రాణం బలి
Intro:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల పథకాల అమలుకు సేవా దృక్పథంతో సమాజానికి సేవలందించేలా వాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ... జూలై నెలలో వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ హాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్ ల తో సమీక్షించారు. ఆన్ లైన్ లో వాలంటీర్ల నియామకానికి వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు స్క్రూట్నీ చేయాలన్నారు. జులై 11 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించాలని... ఆగస్టు 15 నాటికి వాలంటీర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సుమారుగా 17550 మంది వాలంటీర్ల అవసరమవుతారన్నారు. నిబంధనల ప్రకారం ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని అన్నారు.


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897

ABOUT THE AUTHOR

...view details