ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన : సీఎం

By

Published : Nov 23, 2022, 2:15 PM IST

CM JAGAN TOUR IN SRIKAKULAM
CM JAGAN TOUR IN SRIKAKULAM ()

CM JAGAN TOUR IN SRIKAKULAM : రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే జరుగుతోందని.. మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని సీఎం జగన్​ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పత్రాలు అందించారు.

మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన

CM JAGAN TOUR IN NARASANNAPETA : రాష్ట్రంలో ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమస్యలను సరిచేసి అన్ని రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో జగన్‌ పాల్గొని.. లబ్ధిదారులకు పత్రాలు అందించారు. రాష్ట్రంలోని భూములన్నింటిని కొలతలు వేసే కార్యక్రమమిది అని.. ప్రతి కమతానికి ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌ ఇస్తున్నామన్నారు. అన్ని రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామన్న సీఎం.. ఇకపై భూములు ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుందని తెలిపారు. రైతుల భాగస్వామ్యం, సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే జరుగుతోందని.. మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతాయన్నారు.

"ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీంతో భూములు ఆక్రమించుకుంటారనే భయం తొలగిపోతుంది. క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు సాఫీగా జరుగుతాయి. రైతుల భాగస్వామ్యం, సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు గ్రామ సచివాలయాల ద్వారా జరిగేలా నిర్ణయం తీసుకున్నాం"-సీఎం జగన్​

భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందించే మహత్తర కార్యక్రమం అని సీఎం జగన్​ పేర్కొన్నారు. మొదటి దశలో 2 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాలను ఇస్తున్నట్లు తెలిపారు. రెండో దశలో 2023 ఫిబ్రవరిలో 4 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. మూడో దశలో 2023 మే నాటికి 6 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నాలుగో దశలో 2023 ఆగస్టు నాటికి 9 వేల గ్రామాల్లోని రైతులకు భూహక్కు పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబర్‌ నాటికల్లా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details