ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాకుళంలో భాజపా గిరిజన మోర్చా సమావేశం

By

Published : Oct 11, 2020, 10:37 AM IST

గిరిజన గ్రామాలకు కేంద్ర నిధులు ఇస్తున్న ఘనత ప్రధాని నరేంద్రమోదీ దక్కుతుందని భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు అన్నారు.

శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో గిరిజన మోర్చా సమావేశం
శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో గిరిజన మోర్చా సమావేశం

శ్రీకాకుళం జిల్లా భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గ్రామీణ జ్యోతి పథకం ద్వారా గిరిజనులకు ఉచిత విద్యుత్​ను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. విపక్షాలు భాజపా ప్రభుత్వంపై చెడుగా ప్రచారం చేస్తున్నాయన్నారు. గిరిజన చట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details