ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీడి తోటల్లో ఎలుగు బంటి హల్​చల్​

By

Published : Aug 31, 2021, 9:41 AM IST

వజ్రపుకొత్తూరు మండలంలోని చినవంక, బాతుపురం గ్రామాల మధ్య జీడి తోటల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. జీడి చెట్ల మధ్య తిరుగుతూ అలజడి సృష్టించింది. దాంతో రైతులు హడలిపోయారు.

bear
ఎలుగు బంటి

జీడి తోటల్లో ఎలుగు బంటి హల్​చల్​

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని చినవంక, బాతుపురం గ్రామాల మధ్య జీడి తోటల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. నిన్న సాయంత్రం జీడి చెట్లు మధ్యలో తిరుగుతూ అలజడి సృష్టించింది.

రెండు రోజులుగా వర్షాలు పడుతుండడంతో జీడి చెట్లకు ఎరువులు వేసే పనుల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఆకస్మికంగా ఎలుగును చూసి ప్రాణ భయంతో వారు పరుగులు తీశారు. సమాచారం తెలియడంతో కొంతమంది స్థానికులు కేకలు పెడుతూ వెళ్లారు. చప్పుడు గమనించిన ఎలుగుబంటి.. మెల్లగా తోటల్లోకి జారుకుంది.

ఎలుగుబంట్లు తిరుగుతుండడంతో రైతులు భయపడుతున్నారు. గతేడాది ఈ ప్రాంతంలో ఎలుగు దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:పెద్దపులి కలకలం... కాపరి చూస్తుండగానే ఆవుల మందపై దాడి

ABOUT THE AUTHOR

...view details