ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bad Condition of Govt Hostels: శిథిలావస్థలో ఎస్సీ బాయ్స్ హాస్టల్.. అరకొర సౌకర్యాలతో విద్యార్థుల అవస్థలు

By

Published : Aug 12, 2023, 3:21 PM IST

Updated : Aug 12, 2023, 3:59 PM IST

Bad Condition of Govt Hostels: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహం శిథిలావస్థకు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు వసతి భవనంలో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

Hostel_in_dilapidated_condition
Hostel_in_dilapidated_condition

Bad Condition of Govt Hostels:పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆ విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామంలో ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలురు వసతిగృహం శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్నా పట్టించుకునే నాధుడే లేడంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతిగృహం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడి ఊచలు వేలాడుతుండడంతో భవనం ఎప్పుడు కూలిపోతుందో అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Lack of Facilities in SC Boys Welfare Hostels: శిథిలావస్థకు చేరిన వసతి గృహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70మంది విద్యార్థులున్న వసతి భవనంలో మౌలిక వసతుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంపై పెచ్చులూడి తమపై పడతున్నాయని, నిద్రించే సమయంలో చాలాసార్లు తమపై పెచ్చులూడి పడిపోయాయి అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహ పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని హాస్టల్ వార్డెన్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వసతి గృహం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Minister Meruga on hostels: "అవును.. వాటి పరిస్థితి బాగా లేదు".. మంత్రి మేరుగ కీలక వ్యాఖ్యలు

Students Facing Problems with Dilapidated Hostels: వసతి గృహం శిథిలావస్థకు చేరి మూడేళ్లు గడుస్తున్నా అధికార యంత్రాంగం కనీసం స్పందించిన దాఖలు లేవంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 మంది విద్యార్థులున్న ఈ వసతి గృహంలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగాలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు. వర్షం వస్తే గదిలో నీరు కారడంతో పాటు భోజనం చేసేటప్పుడు పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతున్నాయంటూ వాపోయారు.

Social Welfare Hostels Probelms: "జగన్​ మామయ్య.. మా హాస్టల్స్​ ఎప్పుడు బాగుపడతాయి".. నెల్లూరులో శిథిలావస్థకు హాస్టల్స్​

Srikakulam Boys Hostel Poor Condition: వంటగది, భోజనశాల పూర్తిగా ధ్వంసమై శిథిలవస్థకు చేరడంతో పైకప్పు పడిపోకుండా కర్రలను దన్నుగా పెట్టి అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వసతి గృహం పరిస్థితిపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం అంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వసతి గృహం ఒకటే ఉండడంతో చేసేదేంలేక పేద విద్యార్థులందరూ ఇక్కడే చేరాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించివెంటనే నూతన వసతిగృహాన్ని నిర్మించి.. విద్యార్థులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"మా వసతిగృహం శిథిలావస్థకు చేరడంతో ఎప్పటికప్పుడు పెచ్చులూడి మాపై పడుతున్నాయి. తినే సమయంలో, నిద్రించేటప్పుడు ఇలా ఎప్పుడుపడితే అప్పుడు పెచ్చులూడి పడుతున్నాయి. దీంతోపాటు ఈ వసతి గృహంలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు నిర్వహణ సక్రమంగాలేక తీవ్ర అవస్థలు పడుతున్నాము. దయచేసి అధికారులు దీనిపై స్పందించి మాకు నూతన వసతిగృహాన్ని నిర్మించాలని కోరుతున్నాము." - విద్యార్థుల ఆవేదన

Social Welfare Hostels Problems: నీళ్ల పప్పు.. పురుగుల అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల అవస్థలు

Bad condition of govt hostels శిథిలావస్థలో ఎస్సీ బాయ్స్ హాస్టల్
Last Updated :Aug 12, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details