ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నేనేం పాపం చేశానమ్మా?

By

Published : Jun 25, 2021, 7:36 AM IST

‘అమ్మా... నేను కడుపులో పడినప్పుడు ఆనంద పడి ఉంటావు. ఎప్పుడు నన్ను చూస్తానా అని మాసాలకొద్దీ వేచి చూసుంటావు. నీ గర్భంలో ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా భరించి ఉంటావు. మరి ఎందుకు ఇలా చేశావు. నన్ను ఎందుకు కన్నావు. ఇప్పుడు నేనేందుకు గడ్డెమీద పడి ఉన్నానమ్మా..!

baby dead body  at harichandrapuram
హరిశ్చంద్రపురంలో శిశువు మృతదేహం

ఏం పాపం చేశానని ఇలా పారేశావు.’ అంటూ అభంశుభం తెలియని ఆ పసికందు అంతరాత్మ ఘోషిస్తోంది. ఎవరు చేశారో తెలియదు. ఎందుకు ఇంతకి దారుణానికి ఒడిగట్టారో అర్థం కావట్లేదు. పుట్టిన తరువాత కనీసం కళ్లయినా తెరిచిందో లేదో...ఓ బిడ్డను ఎవరో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి జాతీయరహదారిపై హరిశ్చంద్రపురం వద్ద అండర్‌ పాస్‌ వంతెన దిగువన గెడ్డలో పడేశారు. జన్మించిన కొన్ని క్షణాలకే కనికరం లేకుండా కన్నుమూసేలా చేశారు. ఆ గెడ్డలో పొదలు అడ్డుగా ఉండిపోవడంతో రెండు రోజులుగా చిన్నారి మృతదేహం అక్కడే ఉండిపోయింది. ఎగువ ప్రాంతంలో వేస్తే ఇక్కడికి వచ్చిందనుకోవడానికి ఆ పరిస్థితీ లేదు. సమీపంలో రహదారి పనులు చేస్తున్న ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details