ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీకాకుళం టు జర్మనీ... వయా పుట్టపర్తి

By

Published : Nov 22, 2019, 8:56 PM IST

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆ వనితా... లక్ష్యసాధనే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించినవారే ఉన్నత స్థాయికి చేరుతారనడానికి వనితారెడ్డి మంచి ఉదాహరణ.

సాధించిన పథకాలతో వనితా రెడ్డి

శ్రీకాకుళం టు జర్మనీ... వయా పుట్టపర్తి

శ్రీకాకుళం జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో పుట్టి... లక్ష్యం వైపు అడుగులు వేస్తోంది ఈ వనిత. జిల్లాలోని లోద్దపుట్టి గ్రామానికి చెందిన నైనా తేజరెడ్డి, కుమారి దంపతుల కుమార్తె నైనా వనితా రెడ్డి. వనితా రెడ్డికి చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ.

వనితా రెడ్డి 1నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇచ్చాపురంలో విద్యనభ్యసించింది. తొమ్మిదో తరగతిలో వెన్నెలవలసలోని నవోదయలో ప్రవేశం పొందింది. 2012లో పదో తరగతిలో ఏ గ్రేడ్​లో ఉత్తీర్ణత సాధించింది. అదే విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ చదివి 95.2శాతంతో ఉత్తీర్ణత సాధించింది.

జర్మనీలో చదివే అవకాశం..
వనితా రెడ్డి అనంతపురంలోని పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఇనిస్ట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ వర్సిటీలో... బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసింది. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో యూనివర్సిటీ టాపర్​గా నిలిచి... అమెరికన్ ఫ్రొఫెసర్ జెఫ్రీ కార్గాల్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని, ప్రశంస పత్రాన్ని అందుకుంది. జర్మనీలోని ప్రఖ్యాత కార్లుస్మృహి ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం... ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్​డీ వరకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం వచ్చినందుకు వనితా రెడ్డి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: "ఒత్తిడి తట్టుకోలేం... సాయంత్రం వరకే పనిచేస్తాం"

Intro:AP_SKLM_41_12_PHDKI_JARMANI_VELUTUTTA_RAITU_BIDDA_AVB_AP10138Body:ఈటీవీConclusion:ఈటీవీ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details