ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెదేపా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ : బాలకృష్ణ

By

Published : May 27, 2022, 3:28 PM IST

Balakrishna at Kodikonda: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ తెలుగుదేశం కార్యకర్తలను.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. వారికి పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Hindupur MLA Balakrishna
Hindupur MLA Balakrishna

Balakrishna at Kodikonda: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇటీవల వైకాపా నాయకులు దాడిలో గాయపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాలకృష్ణ రాకతో తెదేపా కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం వచ్చాయి. ఈ సందర్భంగా.. దాడి సంఘటన గురించి స్థానిక తెదేపా నేతలు.. బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. తమ కార్యకర్తల జోలికొస్తే ఖబర్దార్‌ అంటూ వైకాపా నేతలకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. తెదేపా కార్యకర్తలకు కష్టం వస్తే అర్ధరాత్రైనా సరే వస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

కోడికొండలో బాలయ్య..గాయపడ్డ తెదేపా కార్యకర్తలకు పరామర్శ...

ABOUT THE AUTHOR

...view details