ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడు రాజధానులకు మద్దతుగా చీరాల వైకాపా నేతల నిరాహార దీక్ష

By

Published : Feb 13, 2020, 6:44 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గడియార స్తంభం కూడలిలో మూడు రాజధానులు ముద్దు.. అమరావతి వద్దంటూ నినదించారు.

ysrcp protest to three capitals
ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా రిలే నిరాహార దీక్షలు

మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా రిలే నిరాహార దీక్షలు

రాష్ట్రం అభివృద్ది చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైకాపా నేతలు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీఎం నిర్ణయానికి అన్ని ప్రాంతాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు. అమరావతి వల్ల ఒక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని విమర్శించారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details