ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధర్మవరంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

By

Published : Aug 23, 2021, 9:41 AM IST

ప్రకాశం జిల్లాలోని ధర్మవరం సమీపంలో ఉన్న కొండపై గుప్త నిధుల కోసం దుండగులు.. తవ్వకాలు చేశారు. గొర్రెల కాపరులు ఆ ప్రాంతానికి వెళ్లగా.. వారిని గమనించి పరారయ్యారు. తరచూ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు.. గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే వారిపై నిఘా ఉంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు
గుప్త నిధుల కోసం తవ్వకాలు

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరం సమీపంలోని కొండపై గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గొర్రెల కాపరులు రావడాన్ని గమనించిన ఆ అపరిచితులు.. తమ సామగ్రిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ప్రాంతం గతంలో జైనులకు స్థావరంగా ఉండేది. గతంలో.. కొండ దిగువ భాగాన గతంలో మట్టి తవ్వకాలు జరుపుతుండగా ఆ కాలంనాటి సమాధులు కూడా బయట పడ్డాయి.

గొర్రెల కాపరుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తవ్వకాలకు ఉపయోగించిన పనిముట్లు, పసుపు కుంకుమ, టెంకాయలు, పూజా సామాగ్రి, ఆహార పదార్ధాలను గుర్తించారు. తరచూ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు.. గుప్త నిధుల తవ్వకాలు చేపట్టే వారిపై నిఘా ఉంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details