ప్రకాశం జిల్లాలో 'ప్రతి శనివారం ప్రమాదరహిత దినం' అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ.. ప్రమాదాలు నివారణకు తమవంతు బాధ్యత వహించాలని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ అన్నారు. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఎదుటివారికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. జిల్లాలో ప్రతి శనివారం ప్రమాదరహిత దినోత్సవాన్ని(no accidents day) నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్బంగా ఒంగోలులోని సౌత్ బై పాస్ జంక్షన్లో తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన పలువురికి చాకెట్లు, గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.
అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ.. ప్రమాదరహిత జిల్లాగా ఉంచడానికి తమవంతు కృషిచేస్తామని వాహనదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, ఒంగోలు ట్రాఫిక్ డీఎస్పీ పి. మల్లికార్జునరావు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
Compensation must: 'కరెంట్ వైర్లు తాకి మరణిస్తే పరిహారం చెల్లించాల్సిందే'