ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి

By

Published : Jul 21, 2021, 5:31 PM IST

ప్రకాశం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

died
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు మృతి

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన పాపిరెడ్డి, శ్రీనివాసులు అనే వ్యక్తులు... గ్రామ శివారులోని కొండ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారు అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ... అనుమాన్పాద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పాపిరెడ్డికి ఆర్థిక ఇబ్బందులున్నాయని, శ్రీనివాసులుకి కుంటుంబ సమస్యలున్నాయని స్థానికులు తెలిపారు. ఆ కారణంతోనే మద్యంలో విషం కలుపుకుని తాగినట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్తికి తరలించారు.

ఇదీ చదవండి:Cyber Fraud: డేటింగ్​ పేరుతో వలపు వల.. 77 ఏళ్ల వృద్ధునికి 11 లక్షలు టోకరా

ABOUT THE AUTHOR

...view details