ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోతోంది: వైకాపా నేత సుబ్బారావు గుప్తా

By

Published : Feb 4, 2022, 5:23 AM IST

Subba Rao Gupta: తమ పార్టీకి చెందిన నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని వైకాపా నేత సుబ్బారావు గుప్తా ఆరోపించారు. దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసిన గుప్తా... కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు దిల్లీ వచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Subba Rao Gupta
Subba Rao Gupta

Subba Rao Gupta: తమ పార్టీకి చెందిన నేతల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఒంగోలు వైకాపా నేత సుబ్బారావు గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాసేపు ధర్నా చేసిన ఆయన... కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అందరి మీద దాడులు చేస్తున్నారని, ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై దాడి చేసిన వారిని ఇప్పటికీ అరెస్టు చేయలేదన్న ఆయన... దాడికి కారణమైన మంత్రులను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తనపై దాడికి పాల్పడిన వారిని, కారణమైన వారిని వదిలి పెట్టేదేలేదని హెచ్చరించారు. తన ఇంటి మీద, లాడ్జిలో దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సుబ్బారావు గుప్తా తెలిపారు.

ఇదీ చదవండి:అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

ABOUT THE AUTHOR

...view details